Jun 25 2021 @ 16:26PM

‘రాధేశ్యామ్‌’ షూటింగ్ మొద‌లు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ‘రాధేశ్యామ్’. నాలుగు రోజులు షూటింగ్‌, ఓ పాట‌ మిన‌హా ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్త‌యిన వ‌ర‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. మిగిలిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌నుకుంటున్న త‌రుణంలో కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం కావ‌డంతో షూటింగ్ ఆగింది. ఇప్పుడు షూటింగ్‌ల‌కు ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్న కార‌ణంగా అన్ని సినిమాల షూటింగ్స్ ప్రారంభమ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ కూడా శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ షూటింగ్ పూర్తి కాగానే రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను చేయ‌నుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.