Radhe shyam: డబ్బింగ్ పూర్తి చేసిన పూజా హెగ్డే..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “రాధే శ్యామ్”. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఇందులో ప్రభాస్‌కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ప్రేరణగా కనిపించబోతున్న పూజా.. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసింది. ఈ సినిమాకు 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న.. 7 భాషలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో జస్టిన్ ప్రభాకరన్, హిందీ భాషకు గానూ మనన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. 


Advertisement