Aug 20 2021 @ 09:52AM

'Radhe Shyam': జస్ట్ టైటిల్ కార్డ్స్ కోసం భారీ సెట్స్, 3 రోజులు షూట్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న సినిమా 'రాధే శ్యామ్'. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ మరో మూడు రోజులు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్లాన్ చేసినట్టు తాజా సమాచారం. దాదాపు 10 ఏళ్ల తర్వాత కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు ప్రభాస్. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే జస్ట్ టైటిల్ కార్డ్స్ కోసం గండికోట ప్రాంతంలో భారీ సెట్టింగ్స్ నిర్మిస్తున్నారట. కేవలం టైటిల్ అండ్ ఎండ్ కార్డ్స్ షూటింగ్ కోసమే ఈ సెట్టింగ్స్ నిర్మిస్తునట్టు తెలుస్తోంది. మూడు రోజులు పాటు ఈ సెట్టింగ్స్‌లో షూటింగ్ జరపనున్నట్టు సమాచారం. గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సమర్పణలో వంశీ - ప్రమోద్ - ప్రశీద నిర్మిస్తున్నారు.