Radhe Shyam: ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్స్.. ప్రీమియర్స్‌తోనే రికార్డు స్థాయి కలెక్షన్స్!

ABN , First Publish Date - 2022-03-12T18:23:12+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన ప్రేమకథ చిత్రం 'రాధే శ్యామ్'.

Radhe Shyam: ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్స్.. ప్రీమియర్స్‌తోనే రికార్డు స్థాయి కలెక్షన్స్!

ఓవర్సీస్ సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన ప్రేమకథ చిత్రం 'రాధే శ్యామ్'. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో గురువారం పడ్డ ప్రీమియర్ షోలకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. ప్రీమియర్స్‌తోనే 9.04లక్షల డాలర్లు(సుమారు రూ.6.93కోట్లు) వసూలు చేయడం విశేషం. దీంతో హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లు సాధించింది 'రాధే శ్యామ్' అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. అక్కడ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని యూఎస్‌లో ఈ సినిమాను విడుదల చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వెల్లడించింది. తెలుగులో మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైంది. సౌత్‌లో మరీ ముఖ్యంగా మన తెలుగులో ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్‌తో వచ్చిన ప్రేమ కథ మరొకటి లేదు. 


'రాధే శ్యామ్' మాంచి విజువల్ ఫీస్ట్ అని అందరూ చెప్పుకోవడం ఆసక్తికరం. ప్రభాస్ లుక్స్, స్టైలింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. క్లైమాక్స్ అత్యద్భుతంగా ఉంది. సాధారణంగా ప్రేమ కథల్లో ఈ తరహా క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించరు. అదే ఇప్పుడు ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. జస్టిన్ ప్రభాకరన్ తనపై దర్శక నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం న్యాయం చేశాడు. అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్‌గా మారింది. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లవ్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఒకవైపు ప్రభాస్ ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ.. మరోవైపు తాను రాసుకున్న కథకు సరిగ్గా న్యాయం చేశాడు. అందమైన కథ.. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే.. వినసొంపైన సంగీతం అన్ని కలిపి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' అని అభిమానులు, ప్రేక్షకులు అంటున్నారు.



Updated Date - 2022-03-12T18:23:12+05:30 IST