Oct 20 2021 @ 07:48AM

'రాధే శ్యామ్': క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లా..?

జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్'. ఈ మూవీ క్లైమాక్స్ కోసమే భారీగా ఖర్చు చేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ - ప్రమోద్ - ప్రశీద దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ కోసమే 50 కోట్లు మేకర్స్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ముందునుంచి చిత్రబృందం 'రాధే శ్యామ్'లో క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతూవస్తున్నారు. కాబట్టే అంత బడ్జెట్ కేటాయించారట. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా 'రాధే శ్యామ్' భారీ అంచనాల నడుమ 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతోంది.