రైతులను బలిపశువులను చేసిన ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2020-09-30T11:14:39+05:30 IST

వ్యవసాయ బిల్లులతో ప్రభుత్వాలు రైతులను బలిపశువులను చేశాయని యువజన కాంగ్రాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ..

రైతులను బలిపశువులను చేసిన ప్రభుత్వాలు

 యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు  రాకేష్‌రెడ్డి ధ్వజం

 నగరంలో నిరసన ర్యాలీ


ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 29: వ్యవసాయ బిల్లులతో ప్రభుత్వాలు రైతులను బలిపశువులను చేశాయని యువజన కాంగ్రాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాచూరి రాకేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులను దెబ్బతీసే విధంగా పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేసు కొందన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతపా డిందన్నారు. 


మంగళవారం యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాఽ ద్యక్షుడు బీఆర్‌.గౌస్‌ ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్‌ నుంచి ప్రకాశంభవన్‌ వరకు నిరసన రాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్‌రెడ్డి మాట్లడుతూ రైతులను నష్టప రిచే విధంగా బిల్లులపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి రద్దు చేయాలన్నారు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని నగదు బదిలీగా మార్చడం సరైన చర్యకాదన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు దాసరి రవి,  షేక్‌ రసూల్‌, బొడు ్డసతీష్‌, తుమ్మల సుబ్బా రావు, సుదర్శి రవి, బండి కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T11:14:39+05:30 IST