అనుచిత పోస్టుపెడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-12-04T12:55:41+05:30 IST

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అభ్యర్థులు, కార్యకర్తలు ప్రజలు సహకరించాలన్నారు. సోషల్‌ మీడియాపై ...

అనుచిత పోస్టుపెడితే కఠిన చర్యలు

బాణసంచా, డీజే సౌండ్స్‌ నిషేదం

ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా..

ప్రతి ఒక్కరు సహకరించాలి - రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అభ్యర్థులు, కార్యకర్తలు ప్రజలు సహకరించాలన్నారు. సోషల్‌ మీడియాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో లేనిపోని రూమర్స్‌ క్రియేట్‌ చేసి, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఇతరులను రెచ్చగొట్టేలా అనుచిత పోస్టులు, మెసేజ్‌లు పెట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లెక్కింపు ముగిసి న తర్వాత గెలిచిన అభ్యర్థులు 48 గంటల వరకు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నా రు. పోలీస్‌ అనుమతి తీసుకున్న తర్వాతనే ర్యాలీలు నిర్వహించుకోవాలన్నారు. విజయోత్సవ ర్యాలీ లో బాణసంచా కాల్చడం, డీజే సౌండ్స్‌ నిషేధం అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. 


సర్వేలతో గందరగోళం

అడ్డగోలుగా వస్తున్న ఎన్నికల ఫలితాల పోస్టులు అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. సైలెంట్‌గా జరిగిన పోలింగ్‌ ప్రక్రియ ఎవరి భవితవ్యం తేల్చనుందో అర్థమవ్వక తలలు పట్టుకుంటున్న అభ్యర్థులకు అడ్డగోలుగా వస్తున్న సోషల్‌మీడియా సర్వేలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలు ఏవిధంగా ఉన్నా.. మరి కొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలపై స్పష్టత రానుంది.

Updated Date - 2020-12-04T12:55:41+05:30 IST