ఇరాన్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో దొంగతనాలు

ABN , First Publish Date - 2021-06-05T22:30:12+05:30 IST

మాయమాటలతో దృష్టి మరల్చి నగదు దోచుకెళుతున్న అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను

ఇరాన్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో దొంగతనాలు

హైదరాబాద్: మాయమాటలతో దృష్టి మరల్చి నగదు దోచుకెళుతున్న అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ చెబుతూ.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27న తమకు దీనికి సంబంధించిన ఫిర్యాదు వచ్చిందన్నారు. అమెరికా డాలర్లు ఉన్నాయంటూ రైస్ వ్యాపారి దృష్టి మరల్చి 30 వేలు దోచుకెళ్లారన్నారు. మరో కేసులో 20 వేలు దోచుకెళ్లారని చెప్పారు. మాటలతో అవతలి వారిని బోల్తా కొట్టించి పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్తున్నారని సీపీ అన్నారు. దీనిపై స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశామని.. ఇంటర్ నేషనల్ గ్యాంగ్‌గా గుర్తించామన్నారు. ఇరాన్‌లోని టెహ్రాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 కేసులు ఉన్నాయని, ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 35 వేల నగదు, 811 అమెరికా డాలర్లు, మారుతి షిఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.  నిందితుల దగ్గర వర్జినల్ పాస్ పోర్ట్ లేదని, ఇరాన్ నుంచి హైదరాబాద్ వచ్చి దొంగతనాలు చేస్తున్నారన్నారు.

Updated Date - 2021-06-05T22:30:12+05:30 IST