రేసు రసవత్తరం!

ABN , First Publish Date - 2020-10-31T10:14:20+05:30 IST

రాజస్థాన్‌ రాయల్స్‌తో కీలక పోరులో పంజాబ్‌ ఓడడంతో ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. మొత్తం ఎనిమిది జట్లలో ముంబై మాత్రమే ప్లేఆ్‌ఫ్సకు చేరింది. చెన్నై ఇప్పటికే టోర్నీనుంచి నిష్క్రమించింది.

రేసు రసవత్తరం!

రాజస్థాన్‌ రాయల్స్‌తో కీలక పోరులో పంజాబ్‌ ఓడడంతో ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. మొత్తం ఎనిమిది జట్లలో ముంబై మాత్రమే ప్లేఆ్‌ఫ్సకు చేరింది. చెన్నై ఇప్పటికే టోర్నీనుంచి నిష్క్రమించింది. శుక్రవారంనాటి మ్యాచ్‌ ఫలితం దరిమిలా..మిగిలిన మూడు ప్లేఆఫ్స్‌ స్థానాలకోసం ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌తోపాటు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ కూడా పోటీలో నిలిచాయి. దాంతో శని, ఆదివారాల్లో జరిగే డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఆసక్తి రేపుతున్నాయి. అన్ని జట్ల మధ్య రెండు పాయింట్ల అంతరమే ఉండడం గమనార్హం. ఇక..పంజాబ్‌ ఓటమితో పెద్దగా ఊరట చెందిన జట్టు నైట్‌రైడర్స్‌. కాగా చెన్నైతో తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడి, బెంగళూరు-హైదరాబాద్‌పై గెలిచి, ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే.. కోల్‌కతా- రాజస్థాన్‌ మధ్య పోరు అత్యంత ఆసక్తికరం కానుంది.

Updated Date - 2020-10-31T10:14:20+05:30 IST