Jun 28 2021 @ 12:19PM

'రేస్‌ 4' కి రంగం సిద్దమవుతోందా..!

బాలీవుడ్‌లో రూపొందుస్తున్న క్రేజీ సీక్వెల్‌లో 'రేస్' ఫ్రాంఛైజీ ఒకటి. ఈ సిరీస్‌లో భాగంగా 'రేస్‌ 4' కి మేకర్స్ సన్నాహాలు మొదలు పెట్టినట్టు ప్రస్తుతం బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రమేష్‌ తరౌణి భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన మూడు భాగాలకి స్క్రిప్ట్ అందించిన శిరాజ్‌ అహ్మద్‌ 'రేస్‌ 4' చిత్రం కోసం కథను సిద్ధం చేస్తున్నారట. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ అవగానే దర్శకుడు సహా ప్రధాన తారాగణాన్ని ప్రకప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 'రేస్‌ 1 ', 'రేస్‌ 2' చిత్రాల్లో సైఫ్‌ అలీఖాన్‌ హీరోగా నటించాడు. 'రేస్‌ 3'లో సల్మాన్‌ నటించారు. ఇప్పుడు రూపొందబోయో 'రేస్‌ 4'లో హీరోగా ఎవరు నటిస్తారో అనే ఆసక్తి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇక అన్నీ అనుకునట్టు పూర్తయితే, ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు నిర్మాత రమేష్‌ తరౌణి సన్నాహాలు చేస్తున్నారట. 

Bollywoodమరిన్ని...