నాసా సమ్మేళనానికి ‘రవీంద్రభారతి’ విద్యార్థులు

ABN , First Publish Date - 2022-01-26T06:06:48+05:30 IST

నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)లో ఈ ఏడాది మే నెలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు మండలంలోని వెల్లంకి సమీపంలో వున్న రవీంద్రభారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్టు స్కూల్‌ చైర్మన్‌ ఎంఎస్‌ మణి మంగళవారం తెలిపారు.

నాసా సమ్మేళనానికి ‘రవీంద్రభారతి’ విద్యార్థులు
ఎంపికైన విద్యార్థులతో స్కూల్‌ చైర్మన్‌ మణి

ఆనందపురం, జనవరి 25: నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)లో ఈ ఏడాది మే నెలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు మండలంలోని వెల్లంకి సమీపంలో వున్న రవీంద్రభారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్టు స్కూల్‌ చైర్మన్‌ ఎంఎస్‌ మణి మంగళవారం తెలిపారు. మే 27 నుంచి 29 వరకు జరగనున్న అంతర్జాతీయ అర్లింగన్‌ వర్జీనీయా సమ్మేళనంలో తమ విద్యార్థులు పాల్గొనే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇందుకోసం తమ విద్యార్థులు ఆర్టిఫీషియల్‌ లొకేటెడ్‌ ఆఫ్‌ వరల్డ్‌ ప్లేనెట్‌ (ఏఎల్‌వోపీ), గ్రేటర్‌ అడ్వాన్స్‌డ్‌ స్పేస్‌ కాలనైజేషన్‌ (జీఏఎస్‌సీ) ప్రాజెక్టులతో సిద్ధమైనట్టు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల జోనల్‌ ఇన్‌చార్జి ఎన్‌.వెంకటేశ్‌నాయుడు, జీఎం జి.వసంత, డీజీఎం బి.లలితకుమారి, ప్రిన్సిపాల్‌ ఎం.రజనీలు అభినందించారు. 

Updated Date - 2022-01-26T06:06:48+05:30 IST