రబీ రుణ లక్ష్యం చేరేనా.?

ABN , First Publish Date - 2020-12-06T05:21:30+05:30 IST

రబీ సీజన్‌లో బ్యాంకర్లు అందించాల్సిన రుణ లక్ష్యం ఇంకా చే రుకోలేదు. రబీ సీజన్‌ ప్రారంభమయి ఇప్పటికే రెండు నెలలు దాటింది. జిల్లాలో సీజన్‌ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనందు వల్ల ఇప్పటికి ల క్ష్యంలో 35 శాతం మేర రుణాలను అందించడం జరిగింది.

రబీ రుణ లక్ష్యం చేరేనా.?

 ఇప్పటికి కేవలం 35 శాతం మంజూరు

క్షేత్రస్థాయిలో తొలగని ఆటంకాలు


ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 5: రబీ సీజన్‌లో బ్యాంకర్లు అందించాల్సిన రుణ లక్ష్యం ఇంకా చే రుకోలేదు. రబీ సీజన్‌ ప్రారంభమయి ఇప్పటికే రెండు నెలలు దాటింది. జిల్లాలో సీజన్‌ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనందు వల్ల ఇప్పటికి ల క్ష్యంలో 35 శాతం మేర రుణాలను అందించడం జరిగింది. రూ.4,465కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకర్లు, జి ల్లావ్యాప్తంగా 76,000 మంది రైతులకు దాదాపు రూ.1600 కోట్ల రుణాలను అందించినట్లు అధికా రులు చెబుతున్నారు. నివర్‌ తుఫాన్‌ దృష్ట్యా రైతులకు రుణ అవసరం ఇంకా పెరిగింది. అ ర్హత  కలిగిన ప్రతి రైతుకు  యుద్ధప్రాతిపదికన రుణం అందించాలని జిల్లావ్యాప్తంగా ఉన్న బ్యా ంకర్లకు ఆదేశాలిచ్చినట్లు లీడ్‌ బ్యాంకు మేనేజరు యుగంధర్‌రెడ్డి తెలిపారు.


ఖరీఫ్‌లో చేరుకున్న లక్ష్యం

 

ఖరీఫ్‌లో రూ.4,034 కోట్లు రుణ లక్ష్యం కాగా వందశాతం సాధించడంలో యంత్రాంగం సఫలీ కృతమయింది. దాదాపు 3,51,000 మంది రైతుల కు రుణాలు అందించారు. వీటిలో కొన్ని సర్దుబా టు రుణాలు ఉన్నప్పటికీ అవి పది శాతం లోపే ఉండడంతో ఎక్కువ మంది రైతులు రుణ సదు పాయాన్ని పొందారు.


రబీ ప్రణాళికలు


రబీ సీజన్‌లో 4 లక్షల మందికి రుణ సౌకర్యం కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకు న్నారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు రచి ంచుకుని రెండు వారాల కొకసారి సమీక్షలు కూ డా చేస్తున్నారు. నివర్‌ తుపానుతో రైతులు ఇం కా కుదేలైన నేపథ్యంలో రుణాల మంజూరులో విశాల దృక్పథంతో వ్యవహరించాలని ఇటీవల జ రిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ పోలా భా స్కర్‌ సైతం సూచించారు


క్షేత్రస్థాయిలో ఇబ్బందులు


జిల్లా అధికారుల సూచనలను క్షేత్రస్థాయిలో కొన్ని బ్యాంకులు పట్టించుకున్న దాఖలాలు కని పించడం లేదు. నిబంధనల పేరిట రైతులను వారాల తరబడి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటు న్నాయి. దీంతో కొంతమంది రైతులు తిరిగి దళారులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న రైతాంగంలో 80శాతం మంది చిన్న, సన్నకారు రైతాంగం అ యినందున రుణ పరిమితి(స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) ని  కూడా పెంచాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2020-12-06T05:21:30+05:30 IST