రబీ కార్యాచరణపై మార్టేరు శాస్త్రవేత్తల సమీక్ష

ABN , First Publish Date - 2020-12-06T05:10:43+05:30 IST

రబీ సీజన్‌లో చేపట్టవలసిన కార్యాచరణపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (మార్టేరు) శాస్త్రవేత్తలు వెబ్‌ సెమి నార్‌ ద్వారా సమీక్షించారు.

రబీ కార్యాచరణపై మార్టేరు శాస్త్రవేత్తల సమీక్ష
వివరాలను తెలుసుకుంటున ్న మార్టేరు శాస్త్రవేత్తలు

పెనుమంట్ర, డిసెంబరు 5: రబీ సీజన్‌లో చేపట్టవలసిన కార్యాచరణపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (మార్టేరు) శాస్త్రవేత్తలు వెబ్‌ సెమి నార్‌ ద్వారా సమీక్షించారు. పరిశోధనా సహ సంచాలకుడు జి.జోగినాయుడు అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో జేడీ గౌసియాబేగం, డీడీఏ మాధవరావు కార్యచరణ వివరించారు. ఖరీఫ్‌ వరి, ఇతర పంటల దిగుబడులు వివ రించారు. రబీ సాగుకు అనువైన వరి రకాలపై వ్యవసాయాశాఖ అధికారులు అడిగిన ప్రశ్నకు పీవీ.రమణరావు వివరించారు. నేరుగా వెదజల్లే పద్దతిలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. భూసార పరిరక్షణ, యాజమా న్యంపై టి.ఉషారాణి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.రమేష్‌బాబు మాట్లాడుతూ రబీలో స్వల్పకాలిక మైలేన దిగుబడులను ఇచ్చే రకాలను సాగు చెయ్యాలని సూచించారు. కొత్తచిరు సంచుల ద్వారా ఉత్తమ రబీ వరి వంగడాలను రైతులకు అందుబాటులో తీసుకురావడానికి అనువైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జోగినాయుడు మాట్లాడుతూ వ్యవసాయశాఖ అనుబంధంతో శాస్త్రవేత్తలను కమిటీలుగా ఏర్పాటుచేసి రబి పంటల ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. నారుమడులు, నాట్లు సాధ్యమైనంత నెలాఖరుకు పూర్తి చేస్తే దిగుబడి తగ ్గకుండా ఉంటుందని వివరించారు. 

–––––––––––––––––––––––––


Updated Date - 2020-12-06T05:10:43+05:30 IST