గర్భిణులకు రాగి జావ మంచిదేనా? ప్రయోజనాలేంటో తెలియజేయండి..

ABN , First Publish Date - 2022-02-25T17:28:33+05:30 IST

భారతదేశంలో క్రీస్తుపూర్వం 2300 యేళ్ల నుంచీ వినియోగంలో ఉన్న చిరుధాన్యాలలో రాగులు ఒకటి. మనకు తెలిసిన ధాన్యాలు, చిరుధాన్యాలన్నిటిలో రాగులలో కాల్షియం, పొటాషియం అధికం. శాకాహారులకు ఐరన్‌ అందించే ఆహారపదార్థాలలో రాగులు ప్రధానమైనవి

గర్భిణులకు రాగి జావ మంచిదేనా? ప్రయోజనాలేంటో తెలియజేయండి..

ఆంధ్రజ్యోతి(25-02-2022)

ప్రశ్న: గర్భిణులు రాగి జావ తీసుకోవచ్చా? రాగి జావ ప్రయోజనాలు తెలుపండి. 


- సన్యాసినాయుడు, ఎరుకవానిపాలెం


డాక్టర్ సమాధానం: భారతదేశంలో క్రీస్తుపూర్వం 2300 యేళ్ల నుంచీ వినియోగంలో ఉన్న చిరుధాన్యాలలో రాగులు ఒకటి. మనకు తెలిసిన ధాన్యాలు, చిరుధాన్యాలన్నిటిలో రాగులలో కాల్షియం, పొటాషియం అధికం. శాకాహారులకు ఐరన్‌ అందించే ఆహారపదార్థాలలో రాగులు ప్రధానమైనవి. బియ్యంతో పోల్చినప్పుడు రాగులలో పీచుపదార్థం, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మనకు శక్తినిచ్చే చాలారకాల ‘బి’ విటమిన్లు రాగులలో పుష్కలంగా లభిస్తాయి. గ్లైసిమిక్స్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షించే లక్షణాలు రాగులలో ఉన్నాయి. వీటిలోని పీచుపదార్థాల వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమేకాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్దపేగుల క్యాన్సర్‌ నిరోధించబడతాయి. రాగులు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, అంటువ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రాగులను మొలకెత్తించడం వల్ల వాటిలోని పోషక గుణాలు వృద్ధి చెందుతాయి. మొలకలెత్తించిన రాగులతో చేసిన జావ పసిపిల్లలకు కూడా తేలికగా జీర్ణమవుతుంది. రాగి జావను అన్ని వయసుల వారు, గర్భిణులు, బాలింతలు కూడా తీసుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-25T17:28:33+05:30 IST