ఎముకలు గట్టిగా ఉండి, యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-02-16T17:59:11+05:30 IST

ఒకప్పుడు రాగులు ప్రధానమైన పంట. ఇప్పుడు కూడా మెట్ట ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో రాగులు పండిస్తారు. సులువుగా జీర్ణం కావటంతో పాటు సత్వరమే శక్తినిచ్చే ధాన్యమిది.

ఎముకలు గట్టిగా ఉండి, యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(16-02-2022)

ఒకప్పుడు రాగులు ప్రధానమైన పంట. ఇప్పుడు కూడా మెట్ట ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో రాగులు పండిస్తారు. సులువుగా జీర్ణం కావటంతో పాటు సత్వరమే శక్తినిచ్చే ధాన్యమిది. 


రాగి సంగటి, జావ, రాగిరొట్టె, దోశ, ఇడ్లీ, లడ్డూలు.... ఇలా వివిధ రూపాల్లో రాగుల్ని తింటారు. రాగులతో చేసిన ఏ ఆహారమైనా సులువుగా జీర్ణం అవుతుంది. తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. ఒకప్పుడు కాయాకష్టం చేసేవారు రాగుల్ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. ముఖ్యంగా రాగుల్లో ఫైబర్‌ అధికం. ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు కాల్షియం, అయోడిన్‌ ఉంటుంది. 


మధుమేహంతో బాధపడే వాళ్లు రాగిపిండితో చేసిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. దీంతో పాటు రక్తపోటును నియంత్రించే గుణం వీటికి ఉంది. అందువల్ల గుండెకూ మంచిదే.


కొవ్వుశాతాన్ని తగ్గించే గుణం రాగులకు ఉంది. ఈ ఆహారం తీసుకుంటే.. త్వరగా ఆకలి కాదు. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 


రాగుల్లో ఐరన్‌ పుష్కలం. దీంతో రక్తహీనత దరి చేరదు. పైగా ఎముకలు గట్టిగా ఉంటాయి. ముఖ్యంగా రాగులతో చేసిన ఆహారం తిన్న వ్యక్తుల్లో గట్టిదనం ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల యంగ్‌గా కనిపిస్తారు. 


పాలిచ్చే తల్లులు రాగులతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల బిడ్డకు బలం వస్తుంది. చిన్నపిల్లలు రాగిజావ, రాగి సంగటి తినటం వల్ల చురుగ్గా ఉంటారు.

Updated Date - 2022-02-16T17:59:11+05:30 IST