గద్దర్‌‌ను ఢీ అంటే ఢీ అన్న ఏకైక మహా కవి వంగపండు: ఆర్. నారాయణమూర్తి

ABN , First Publish Date - 2021-08-05T02:04:23+05:30 IST

గద్దర్‌‌ను ఢీ అంటే ఢీ అన్న ఏకైక మహా కవి వంగపండు: ఆర్. నారాయణమూర్తి

గద్దర్‌‌ను ఢీ అంటే ఢీ అన్న ఏకైక మహా కవి వంగపండు: ఆర్. నారాయణమూర్తి

విశాఖ: వంగపండు ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బాడ సూరన్నకి వంగపండు పురస్కారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అందించారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ గద్దర్‌‌ను ఢీ అంటే ఢీ అన్న ఏకైక మహా కవి వంగపండు అని చెప్పారు. ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి వంగపండు. వంగపండు గొప్ప నాటక రచయిత. అడవి దివిటీలు అనే మంచి నాటకాన్ని రాశారు. వంగపండు బతికి ఉంటే ఇప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఆడి, పాడి బీభత్సంగా ఉద్యమించే వారు. స్టీల్‌ప్లాంట్ కోసం అందరూ ఒక్కటై గొంతు విప్పాలి. అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా చూడటమే వంగపండుకి అసలు సిసలు నివాళి.’’ అని నారాయణమూర్తి తెలిపారు. 


విమలక్క మాట్లాడుతూ ‘‘వంగపండు అన్న జీవితం ఆదర్శం. ప్రతి ఒక్కరూ ఆయన ఆటపాటలకు మంత్రముగ్ధులయ్యారు, వంగపండన్న ప్రజా జీవితమే మమ్మల్ని ఇక్కడి వరకు తెప్పించింది. అంతరించి పోతున్న కళలను, కళాకారులను కాపాడుకోవాలని ఏపీ సీఎంను కోరుతున్నా.’’ అని అన్నారు.

Updated Date - 2021-08-05T02:04:23+05:30 IST