కపిల్‌దేవ్ రికార్డును అధిగమించిన అశ్విన్

ABN , First Publish Date - 2022-03-06T23:22:06+05:30 IST

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి కపిల్‌దేవ్ రికార్డును

కపిల్‌దేవ్ రికార్డును అధిగమించిన అశ్విన్

మొహాలీ: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి కపిల్‌దేవ్ రికార్డును అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో ఇండియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్ తన మొత్తం వికెట్ల సంఖ్యను 435కు పెంచాడు.


దీంతో ఇప్పటి వరకు 434 వికెట్ల తేడాతో జాబితాలో రెండో స్థానంలో ఉన్న కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టేశాడు. మూడో రోజు శ్రీలంక బ్యాటర్ పాథమ్ నిశ్శంకను అవుట్ చేసి కపిల్ రికార్డును సమం చేసిన అశ్విన్ టీ తర్వాత చరిత్ అసలంక‌ను పెవిలియన్ పంపి 435 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.


టెస్టు క్రికెట్‌లో 400కుపైగా వికెట్లు తీసుకున్న నాలుగో ఇండియన్ బౌలర్‌గానూ అశ్విన్ రికార్డులకెక్కాడు. అంతేకాదు, అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ప్రపంచంలోని తొమ్మిదో బౌలర్‌గానూ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు.


ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడీ (431)ను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆడుతున్న లంక బౌలర్ రంగన హెరాత్ 432 వికెట్లు సాధించి అశ్విన్ వెనక ఉన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ (537), జేమ్స్ అండర్సన్ (640) అశ్విన్ కంటే ముందున్నారు. 



Updated Date - 2022-03-06T23:22:06+05:30 IST