డీసీసీ భవన్‌లో క్విట్‌ ఇండియా దినోత్సవం

ABN , First Publish Date - 2020-08-10T11:08:38+05:30 IST

హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆదివారం క్విట్‌ ఇండియా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ

డీసీసీ భవన్‌లో క్విట్‌ ఇండియా దినోత్సవం

పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి


 వరంగల్‌ సిటీ, ఆగస్టు 9 : హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆదివారం క్విట్‌ ఇండియా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యత. దేశ స్వాతంత్య్ర పరిణామాలను గుర్తు చేశారు.  కార్యక్రమంలో మీసాల ప్రకాశ్‌, బిన్నీ లక్ష్మణ్‌, గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి, తక్కళ్లపల్లి రామ్‌మోహన్‌రావు, తోట వెంకన్న,  అజీజుల్లాహ్‌బేగ్‌ తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

 

యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం డీసీసీ భవన్‌లో జరిగాయి. నాయిని రాజేందర్‌రెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తోట పవన్‌  పాల్గొన్నారు.


ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ దినోత్సవం

ఖిలావరంగల్: వరంగల్‌ వెంకట్రామ జంక్షన్‌లో యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు పొలెపాక దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈవేడుకల్లో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్‌ పాల్గొని కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు కూచన రవీందర్‌, జన్ను జీవన్‌, గొర్రె రవి, కోడెం మహేష్‌, కూచన శివ, కుడికాల కల్యాణ్‌, రహమత్‌, గూడూరు ప్రసాద్‌, చెన్నూరి రాజు, పొలెపాక ప్రవీణ్‌ పాల్గొన్నారు.


ఎల్కతుర్తి : మండలంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సుకినే సంతాజీ, యూత్‌ కాంగ్రెస్‌ హుస్నాబాద్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మండ సుమన్‌గౌడ్‌, ప్రధానకార్యదర్శి శివగౌడ్‌, మీడియా సెల్‌ మండల అధ్యక్షుడు బొల్లేపోగు రమేష్‌బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T11:08:38+05:30 IST