లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-27T06:16:26+05:30 IST

పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసమే లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత అన్నా రు. ఆదివారం జాతీయ లోక్‌ ఆదాలత్‌ను జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా వారి కేసులను పరిష్కరించుకున్నారు.

లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం
ఆదిలాబాద్‌లో కక్షిదారుల సమస్యలను పరిష్కరిస్తున్న జిల్లా న్యాయమూర్తి

జిల్లా న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత 

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 26: పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసమే లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత అన్నా రు. ఆదివారం జాతీయ లోక్‌ ఆదాలత్‌ను జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా వారి కేసులను పరిష్కరించుకున్నారు. జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులు కక్షిదారులతో మాట్లాడుతూ వారి మధ్య రాజీ కుదిర్చి కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. చిన్నచిన్న తగదాలతో కోర్టుకు వచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయని, వాటిని రాజీ పద్ధతిలో పరిష్కరించేలా న్యాయ సేవా అధికార సంస్థ లోక్‌ఆదాలత్‌ను చేపట్టిందన్నారు. ఇరు వర్గాలు సమ్మతించి న తర్వాతే వారి కేసును పరిష్కరించడం జరుగుతుందన్నారు. దీని వల్ల కక్షిదారులకు కోర్టు చుట్టు తిరిగే సమయం ఆదాతో పాటు డబ్బులు మిగులుతాయన్నారు. ఇక్కడ జరిగిన రాజీపై ఆపిల్‌ చేయడానికి ఉండదని, కోర్టు ఫీజులు తిరిగి చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మదవి కృష్ణ, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జీ సతీష్‌కుమార్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఉదయ్‌భాస్కర్‌, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, జూనియర్‌ సివిల్‌జడ్జి మంజుల సూర్యవర్‌, పీసీఆర్‌జడ్జీ యశ్వంత్‌సింగ్‌ చౌహన్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ ఉమేందర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్రాల నగేష్‌, తదితరులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

బోథ్‌: లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని జేసీజే కోర్టు జడ్జి బి.హుస్సేన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా బోథ్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో ఏళ్ల తరబడి పరిష్కారం కాని కేసులను ఈ ఒక్కరోజులోనే పరిష్కారం చేశామని, రాజీమార్గం మధ్యవర్తిత్వం ద్వారా 40 నేరం ఒప్పుదాల ద్వారా 102 ఎస్టీసీలు 290 బ్యాంకు అదాలత్‌ ద్వారా బోథ్‌ ఎస్‌బీఐ బ్యాంకుకు 31మంది నుంచి రూ. 4,47,5000 ఇచ్చోడ ఎస్‌బీఐ బ్యాంకు వారి ద్వారా 19మంది నుంచి రూ.1,35,000  రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో బార్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ పంద్రం శంకర్‌, ఠాకూర్‌ రూపేందర్‌సింగ్‌, ఆడెపు హారీష్‌, దమ్మాపాల్‌, సీఐ నైలు, ఎస్సైలు కేంద్రే రవీందర్‌, ఉదయ్‌కుమార్‌, కోర్టు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-06-27T06:16:26+05:30 IST