ఇక రైతులకు సత్వర సేవలు

ABN , First Publish Date - 2022-05-25T05:47:01+05:30 IST

రైతు వేదికలు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) కార్యాలయా లుగా ఉపయోగపడుతు న్నాయి.

ఇక రైతులకు సత్వర సేవలు
సుల్తానాబాద్‌ మండల చిన్నకలువల రైతువేదిక భవనంలో ఏఈవోలతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి(ఫైల్‌)

- ఏఈవోల కార్యాలయాలుగా రైతు వేదికలు  

- జిల్లా రైతులకు అందుబాటులో 54 రైతువేదికలు

- ప్రతినెలా నిర్వహణకు రూ.9వేలు కేటాయింపు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రైతు వేదికలు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) కార్యాలయా లుగా ఉపయోగపడుతు న్నాయి. వ్యవసాయ శాఖ సేవలను రైతుల దరి చేర్చేందుకు ప్రభుత్వం వీటిని నిర్మించింది. వీటి ద్వారానే ఏఈవోలు విధులు నిర్వహిస్తూ ఎప్పటిక ప్పుడు రైతులకు సేవలు అందించాలని ప్రభుత్వం పేర్కొంది. వివిధ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు, రైతులంతా అక్కడే కూర్చుని తమ సమస్యలను పరిష్కరించుకు నేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రైతు వేదికలను నిర్మించింది. 

జిల్లాలో 54 క్లస్టర్లు..

ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో 54 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌లో రెండు నుంచి ఐదు గ్రామా లున్నాయి. క్లస్టరుకు ఒక రైతువేదిక చొప్పున నిర్మిం చేందుకు ప్రభుత్వం 2020లో 11 కోట్ల 88 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఒక్కో వేదికకు 22 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇందులో వ్యవసాయ శాఖ ద్వారా 12 లక్షలు, గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 10 లక్షల రూపా యలను కేటాయించారు. 2021 ఫిబ్రవరి వరకు ఈ వేదికలను పూర్తిచేశారు. వీటి నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో అవి పెద్దగా సద్వినియోగం కాలేదు. ఊరికి దూరంగా నిర్మించిన వేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. వాటిని వ్యవ సాయ విస్తరణాధికారులు వివిధ కార్యక్రమాలకు సద్విని యోగం చేసుకుని రైతులకు అవగాహన తరగతులను నిర్వహించారు. ఏఈవోలకు కూడా ప్రత్యేకించి కార్యాలయాలు లేకపోవడంతో రైతు వేదికల్లోనే ఏఈవో కార్యాలయాలను ఏర్పాటు చేసు కోవాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి రైతువేదికలో హాలుతో పాటు రెండు గదులు, మరుగు దొడ్లు, తాగునీటి వసతి ఉన్నాయి. తగిన ఫర్నీచర్‌, సౌండ్‌ సెట్‌ వంటి పరికరాలను కూడా సమకూర్చింది. రైతువేదిక నిర్వహణ కోసం ప్రతినెలా 9 వేల రూపాయల చొప్పున కేటాయించింది. ప్రతి రోజు ఏఈవోలు కార్యాలయానికి ఉదయం 9 గంటలకే వచ్చి క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించాల న్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు రైతు వేదిక వద్దకు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి వచ్చిపోయే రైతులకు పంటల సాగుకు సంబంధించి, ఇతరత్రా సలహాలు, సూచన లు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా మరిన్ని సేవలు అందు బాటులోకి రానున్నాయి. 

పథకాల అమలుపై పర్యవేక్షణ..

వానాకాలం, యాసంగి సీజన్‌లో పంటలకు సంబంధించి యాజ మాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, తెగుళ్ల నివారణకు చర్యలు, ప్రభుత్వం అమలుచేసే పథకాల గురించి రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అనువుగా ఉండను న్నాయి. వ్యవసాయ విస్తరణాధికారులు సైతం అం దుబాటులో ఉంటారు. గతంలో పంటలకు ఏవైనా తెగుళ్లు వస్తే మండల కేంద్రంలో ఉండే వ్యవ సాయాధికారిని గానీ, వ్యవసాయ విస్తరణాధి కారిని గానీ కలిసి, మందులు రాయించుకుని, తెచ్చు కుని పంటలకు వాడేవారు. ప్రస్తుతం రైతువేదికల ద్వారా ఏఈవోలు రైతులకు అందుబాటులోకి తీసు కురావ డం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పం టల సాగు గురించే గాకుండా ఏఈవోలు, ఏవోలు పంట రుణాలు ఇప్పించడం, రుణ మాఫీ, వడ్డీలేని రుణాలు, రైతుబంధు, రైతుబీమా, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం అమలును కూడా పర్యవేక్షించి రైతులకు అవసర మయ్యే సేవ లను అందించనున్నారు. రైతువేదికల్లో ఇప్పటికే అధికారు లు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-05-25T05:47:01+05:30 IST