లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం

ABN , First Publish Date - 2021-02-28T05:37:01+05:30 IST

సత్యర న్యాయమే లోక్‌అదాలత్‌ ధ్యేయమని మండల న్యాయసేవాసంఘం అధ్యక్షుడు, జూనియర్‌ సవిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు అన్నారు.

లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం


కోటబొమ్మాళి: సత్యర న్యాయమే లోక్‌అదాలత్‌ ధ్యేయమని మండల న్యాయసేవాసంఘం అధ్యక్షుడు, జూనియర్‌ సవిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు అన్నారు. ఆయన శనివారం స్థానిక కోర్టు ఆవరణలో వర్చువల్‌ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. 42 కేసులను రాజీ చేశామని, వాటిలో రూ. 23 లక్షల వరకు పరిహారం ఇప్పించామని కోర్టు సిబ్బంది తెలిపారు. ఎంపీడీవో బడే రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ ఆర్‌. మధు, హౌసింగ్‌ ఏఈ ఆర్‌. పాపారావు, న్యాయవాదులు, పోలీసులు ఉన్నారు.

  సోంపేట: రాజీ మార్గమే సరైనదని ఆరో అడిషనల్‌ జిల్లా జడ్జి షేక్‌ఇంతియాజ్‌ అన్నారు. శనివారం సోంపేట ఆరవ అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో వర్చువల్‌ లోక్‌అదాలత్‌,  న్యాయ విజ్ఞాన సదస్సు  నిర్వహించారు. వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా 9కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈ కేసుల నుంచి నష్ట పరిహారం రూ12.50లక్షలు వసూలు చేశామన్నారు.

పాతపట్నం: స్థానిక జూని యర్‌ సివిల్‌ జడ్జికోర్టులో శనివారం నిర్వహించిన వర్చ్యువల్‌ లోక్‌అదాలత్‌లో 17 కేసులు రాజీపడినట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రకాశ్‌బాబు తెలిపారు. లోక్‌అదాలత్‌ సభ్యులు ఫాల్గుణరావు, బార్‌అధ్యక్షుడు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

టెక్కలి: స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు సముదాయంలో జరిగిన వర్చువల్‌ లోక్‌అదాలత్‌లో 18 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.హరిత తెలిపారు. ఇందులో సివిల్‌, క్రిమినల్‌, ఎక్సైజ్‌ తదితర కేసులున్నాయని ఆమె తెలిపారు.   సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఉపాఽధ్యాయులదే కీలకపాత్ర అని టెక్కలి సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.హరిత అన్నారు. శనివారం నౌపడ ఆర్‌ఎస్‌ దరి సర్వోదయ, సాహితి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల సమావేశ మందిరంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.


Updated Date - 2021-02-28T05:37:01+05:30 IST