Jun 23 2021 @ 17:02PM

అరియానాతో క్విక్‌ ఛాట్‌: వర్మకి అది మామూలే!

వివాదాల వర్మతో యాంకర్‌ అరియానా ఒక బోల్డ్‌ ఇంటర్వ్యూ చేసింది. మరీ ఇంత బోల్డ్‌ ఇంటర్వ్యూనా.. అంటే ‘ఇందులో బోల్డ్‌ ఏముంది. ఆర్జీవీతో అంతసేపు ఇంటర్వ్యూ చేయడమే ఓ పెద్ద టాస్క్‌. నాకు ఇది ప్లస్‌ అవుతుందేమో కానీ ఆయనకు మామూలే! ’ అంటుంది అరియానా. ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలో చిత్రజ్యోతి అరియానాను పలకరించినప్పుడు చెప్పిన విశేషాలివి..


ప్రశ్న: మరీ ఇంత బోల్డ్‌ ఇంటర్వ్యూ అవసరమా అంటున్నారు కదా..

జవాబు: అందరూ ‘బోల్డ్‌ ఇంటర్వ్యూ’ అంటున్నారు. నాకైతే అలా అనిపించలేదు. మేం సాధారణంగానే మాట్లాడుకున్నాం. ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. ఈ జిమ్‌ ఇంటర్వ్యూ నాకు ప్లస్‌ అవుతుందేమో కానీ వర్మగారికి మామూలు విషయమే!. ఈ ఇంటర్‌వ్యూకి మంచి స్పందన వస్తోంది. అది బోల్డ్‌ అంటే ఏమీ చేయలేను.

ప్రశ్న: వర్మ ప్రవర్తనపై అనేక విమర్శలున్నాయి కదా..

జవాబు: వర్మ తనకు నచ్చినట్లు జీవిస్తారు. ఆయన చేసేదే చెబుతారు. చెప్పిందే చేస్తారు. కాంట్రవర్సీలతో కాలక్షేపం చేయడం ఆయనకు అలవాటు. నిజంగా ఆర్జీవీగారికి అమ్మాయిలను వేధించే లక్షణం ఉంటే దేశంలోని అతిపెద్దగా చర్చకు వచ్చిన ‘మీటూ’లో ఆయన ఉండేవాడు. ఎవరూ ఆయన మీద ఫిర్యాదు చేయలేదు కదా. 


ప్రశ్న: మీరు జిమ్‌కు ప్రతిరోజూ వెళ్తారా..

జవాబు: నేను ఫిట్‌నెస్‌ గర్ల్‌ కాను. జిమ్‌కు పోవడం ఇష్టం ఉండదు. పైగా నేను ఫుడ్‌ లవర్‌ను. అరగంటకోసారి తినటం అలవాటు. 


ప్రశ్న: ఈ ఇంటర్వ్యూను ట్రోల్‌ చేస్తున్నారు కదా..

జవాబు: కొందరు ఊరికే ఏడుస్తూ ఉంటారు. వారికి బాధ కలిగినా.. అసూయ కలిగినా నన్నే ట్రోల్‌ చేస్తుంటారు. వారికి అదో ఆనందం. నా ద్వారా పాపులర్‌ అవుదామని ప్రయత్నిస్తారు. నా వల్ల ఇంకొకరికి మేలు జరుగుతోందని వదిలేస్తా. 


ప్రశ్న: వర్మను మీరు తొలిసారి ఎప్పుడు కలిసారు..

జవాబు: 2017లో నేను తొలిసారి ఇంటర్వ్యూ చేశా. ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా ఇంటర్వ్యూ చేసే అవకాశమొచ్చింది. ఆయన చేసిన ట్వీట్‌ వల్ల బిగ్‌బాస్‌ దాకా వెళ్లా. ఆ తర్వాత ఇప్పుడే ఇంటర్వ్యూ చేసా. 


ప్రశ్న: ఈ ఫీల్డ్‌లో అవకాశాల కోసం కాంప్రమైజ్‌ కావాలంటారు.. మీ అనుభవాలేమిటి..

జవాబు:  విజయం సాధించాలంటే కోప్పడకూడదు అని తెలుసుకున్నా. కాంప్రమైజ్‌ కాకుంటే ఇక్కడ ఉండలేం. ఈ ఫీల్డ్‌లో కోపం వల్ల సాధించేదేమీ లేదు. కాంప్రమైజ్‌ కావాల్సిందే. తప్పదు.

 

ప్రశ్న: ప్రస్తుతం మీకున్న మిత్రులెవరూ.. 

జవాబు: మా చెల్లి నాకు చాలా క్లోజ్‌. అన్నీ మాట్లాడుకుంటాం. ఇక హీరో రాజ్‌తరుణ్‌ మంచి మిత్రుడు.