జీలుగ విత్తనాల కోసం క్యూ కట్టిన పాసు పుస్తకాలు!

ABN , First Publish Date - 2022-05-19T06:55:18+05:30 IST

వానాకాలం సీజన్‌ సమీపిస్తున్న కారణంగా బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి సహకార సంఘం పరిధిలో గల ఘన్‌పూర్‌ గ్రామంలో స్థానిక సహకార గోదాం వద్ద పెద్దసంఖ్యలో రైతులు జీలు గ విత్తనాల కోసం తరలివచ్చారు. క్యూలో ఎండ తాకిడికి నిలబడలేక వందలాది మంది రైతులు

జీలుగ విత్తనాల కోసం క్యూ కట్టిన పాసు పుస్తకాలు!
పాసుపుస్తకాలను క్యూలో పెట్టిన రైతులు

తీవ్ర ఎండ వేడిమితో రైతుల అవస్థలు

డిచ్‌పల్లి, మే 18: వానాకాలం సీజన్‌ సమీపిస్తున్న కారణంగా బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి సహకార సంఘం పరిధిలో గల ఘన్‌పూర్‌ గ్రామంలో స్థానిక సహకార గోదాం వద్ద పెద్దసంఖ్యలో రైతులు జీలు గ విత్తనాల కోసం తరలివచ్చారు. క్యూలో ఎండ తాకిడికి నిలబడలేక వందలాది మంది రైతులు తమ పట్టా పాసుపుస్తకాలను క్యూలైన్‌లో పెట్టి పడిగాపులుగాచారు. జీలుగ విత్తనాలు తమకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరడంతో వ్యవసాయ అధికారులు క్యూ పద్ధతిని పాటించాలని సూచించడంతో పాసు పుస్తకాలను క్యూ లైన్‌లో పెట్టారు. చివరికి రైతులందరికీ విత్తనాలు అందించే విధంగా సహకార శాఖ సిబ్బంది చర్యలు చే పట్టింది. అలాగే, మండలంలోని బర్ధీపూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం జీలుగ విత్తనాలను సొసైటీ చైర్మన్‌ రామకృష్ణ, సర్పంచ్‌ నీరడి సృజన ఆధ్వర్యంలో జీలుగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.

Updated Date - 2022-05-19T06:55:18+05:30 IST