Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్రాక్టర్ల క్యూ!

కొడంగల్‌ రూరల్‌/(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): వడ్ల లోడ్‌ ట్రాక్టర్లు కొనుగోలు కేంద్రం వద్ద లైన్‌ కట్టి కాన్వాయ్‌ని తలపిస్తున్నాయి. ఆదివారం కొడంగల్‌లో ఓ రైస్‌మిల్లు వద్ద దారిపొడవునా నిలిపి ఉన్న వడ్లలోడ్‌ ట్రాక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని తెలియజేస్తున్నాయి.

  • ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు


మేడ్చల్‌ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. జిల్లాలో 25వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అంచనా వేశారు. అవసరమైన గన్నీ బ్యాగులు, ఇతర ఏర్పాట్లనూ చేస్తున్నారు. జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 7,043 టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. వెయ్యి మంది రైతుల ఖాతాల్లో రూ.10.5కోట్లు జమ చేశారు. మాదారంలో 1,580టన్నులు, ఎదులాబాద్‌లో 1,260, ప్రతాపసింగారంలో 270, లక్ష్మీపూర్‌లో 430, కేశవరంలో 380, ఉద్దమర్రిలో 605, కీసరలో 652, మేడ్చల్‌లో 421, దబిల్‌పూర్‌లో 258, శామీర్‌పేటలో 417, పూడూరులో 738 టన్నులచొప్పున ధాన్యం కొనుగోలు చేశారు. 

Advertisement
Advertisement