ఈ ప్రశ్నలకు బదులేది?

ABN , First Publish Date - 2022-05-27T08:56:12+05:30 IST

హైదరాబాద్‌ సిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లు కలకలం రేపాయి. ఊరు, పేరు

ఈ ప్రశ్నలకు బదులేది?

- మోదీని ప్రశ్నిస్తూ 17 ప్రాంతాల్లో బ్యానర్లు

హైదరాబాద్‌ సిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లు కలకలం రేపాయి. ఊరు, పేరు లేకుండా.. ప్రధాని పర్యటన ఉన్న మార్గాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని వంతెనలు, రెయిలింగ్‌లకు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, నిధులు, విద్యాసంస్థలు, విశ్వ ద్యాలయాల కేటాయింపు, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పనలో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ 17 ప్రశ్నలు సంధించారు. ‘హైదరాబాద్‌కు వస్తున్న మోదీ.. తెలంగాణకు ఎనిమిదేళ్లలో ఏం చేశావు? ముందు వీటికి సమాధానం చెప్పు’ అని డిమాండ్‌ చేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. మోదీజీ అని సంబోధిస్తూ ప్రశ్నలు సంధించారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజ్‌, ట్యాంక్‌బండ్‌, సంజీవయ్య పార్కు రోడ్‌, అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు కార్యాలయం, షేక్‌పేట వంతెన, గన్‌పార్క్‌, గచ్చిబౌలిలోని ఐఎ్‌సబీ వద్ద బ్యానర్లు వెలిశాయి. పేరు లేనప్పటికీ.. ఆయా అంశాలపై తొలి నుంచి కేంద్రాన్ని నిలదీస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులే బ్యానర్లు ఏర్పాటు చేశాయన్న ప్రచారం జరిగింది. 

Updated Date - 2022-05-27T08:56:12+05:30 IST