Ts News: జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు.. కీలక సూత్రదారుల గుర్తింపు..

ABN , First Publish Date - 2022-07-26T17:42:08+05:30 IST

విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు.

Ts News: జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు.. కీలక సూత్రదారుల గుర్తింపు..

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు (question paper leak case) దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రశ్నాపత్రం లీక్ చేయడంలో విద్యుత్ శాఖ ఉద్యోగులే (employees) కీలక సూత్రదారులుగా గుర్తించారు. ADE ఫిరోజ్ ఖాన్, లైన్ మెన్ శ్రీనివాస్‌లను ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులు మైక్రోఫోన్ (Microphone) సహాయంతో అభ్యర్ధులకు సమాధానాలు చేరవేశారు. ఒక్కొక్క ఉద్యోగానికి రూ. 5 లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారని, అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండలో నమోదైన కేసుల్లో స్పెషల్ టీమ్ (Special Team) పోలీసులు రంగంలోకి దిగారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-07-26T17:42:08+05:30 IST