Abn logo
Oct 30 2020 @ 19:58PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘క్వశ్చన్ మార్క్‌’ నిర్మాత

Kaakateeya

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటి.. మరి కొందరిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్నారు. తాజాగా నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?) ఆడియో రిలీజ్  సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు క్వశ్చన్ మార్క్ సినిమా నిర్మాత గౌరీ కృష్ణ (శ్రీకృష్ణ క్రియేషన్స్).


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాకు ఆదర్శంగా నిలిచింది. ఈ రోజు మా నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశంతో ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి.. మొక్కలు పెంచడం అందరూ బాధ్యతగా తీసుకొని పెంచినట్లయితే వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఈ సందర్భంగా మా క్వశ్చన్ మార్క్ సినిమా హీరోయిన్ ఆదాశర్మ, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, దర్శకులు ప్రసాద్, విజయవర్మలను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నాను.. అని తెలిపారు.


Advertisement
Advertisement