Abn logo
Sep 26 2021 @ 01:46AM

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించండి

వాల్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నాయకులు

యువతకు ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ పిలుపు

తిరుపతి(తిలక్‌రోడ్డు), సెప్టెంబరు 25: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలని యువతకు ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘యంగ్‌ ఇండియా కే బోల్‌’ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి సమృద్‌ హెగ్డే, జాతీయ కార్యదర్శి స్వాతి మాలగై మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అమాంతం పెంచేశారని విమర్శించారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేసి, వారికి దాసోహం అవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలోనే జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ దోపిడీ, దౌర్జన్య పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పీసీసీ కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. యంగ్‌ ఇండియా కే బోల్‌ కార్యక్రమం అక్టోబరు ఒకటి నుంచి 20వ తేదీవరకు జిల్లాస్థాయిలో, 21నుంచి 30వరకు రాష్ట్రస్థాయిలో, నవంబరు 14న నెహ్రూ జయంతి రోజున జాతీయ స్థాయిలో నిర్వహిస్తారన్నారు. ఆసక్తి ఉన్న 18-35 ఏళ్లలోపున్న వారు జ్ట్టిఞట://జౌటఝట.జజ్ఛూ/ఒడజ్ఠుఠీగీఠట్చ8ుఽ7డ9గజ7 ద్వారా పేర్లు నమోదు చేసుకుని మాట్లాడవచ్చన్నారు. ప్రతిభ చూపిన వారికి మొదట బహుమతిగా రూ.30వేలు, ద్వితీయబహుమతిగా రూ.20వేలు, తృతీయ బహుమతిగా రూ.10వేలను ఇస్తారన్నారు. నగరి మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ బాబు, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఫైరోజ్‌, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, లోహితారాజు తదితరులు పాల్గొన్నారు.