వ్యాక్సిన్ తీసుకోనివారి విషయంలో కఠిన నిర్ణయం.. హెల్త్ టాక్స్ వసూలుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-01-13T02:07:10+05:30 IST

కొవిడ్ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అయినప్పటికీ కొందరు.. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది

వ్యాక్సిన్ తీసుకోనివారి విషయంలో కఠిన నిర్ణయం.. హెల్త్ టాక్స్ వసూలుకు రంగం సిద్ధం

కెనడా: కొవిడ్ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అయినప్పటికీ కొందరు.. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న వారి విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ తీసుకోనివారిని ఉద్దేశించి.. కొత్తగా హెల్త్ టాక్స్‌ను తీసుకురావాలని ఆలోచిస్తోంది. వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న వారి నుంచి హెల్త్ టాక్స్‌ను వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఓ ప్రకటనలో క్యూబెక్ ప్రీమియర్ ఫ్రాంకోయిస్ లెగాల్ట్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని ప్రజలు ఇతరులకు ఆర్థికంగా భారం అవుతారని అభిప్రాయపడ్డారు. 100 కెనడియన్ డాలర్లకు తగ్గకుండా హెల్త్ టాక్స్ విధించే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. 




Updated Date - 2022-01-13T02:07:10+05:30 IST