కుక్క కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ప్రాణాపాయ స్థితిలో ముగ్గురు

ABN , First Publish Date - 2022-04-14T08:37:06+05:30 IST

ఓ శునకం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.. కుక్క అరుస్తోందనే కారణంతో దాని యజమానిపై పక్కింటి వ్యక్తి గొడవకు వెళ్లాడు.. ఆ గొడవ క్రమంగా పెరిగి కాల్పుల వరకు వెళ్లింది.. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు కాల్పులకు గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు..

కుక్క కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ప్రాణాపాయ స్థితిలో ముగ్గురు

ఓ శునకం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.. కుక్క అరుస్తోందనే కారణంతో దాని యజమానిపై పక్కింటి వ్యక్తి గొడవకు వెళ్లాడు.. ఆ గొడవ క్రమంగా పెరిగి కాల్పుల వరకు వెళ్లింది.. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు కాల్పులకు గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు.. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. సుశీల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఘజియబాద్‌కు సమీపంలోని మోర్త గ్రామంలో నివసిస్తున్నాడు. అతని ఇంటికి సమీపంలో నివసించే సత్యం అనే వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క రాత్రి, పగలూ మొరుగుతూ ఉండేది. ఈ విషయమై సుశీల్, సత్యం మధ్య గతంలో వాగ్వాదం జరిగింది. రాత్రి సమయాల్లో కుక్క అరవడం వల్ల తమకు నిద్ర ఉండడం లేదని సుశీల్ గొడవపడ్డాడు. అప్పుడు గ్రామస్థులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 


సోమవారం రాత్రి కుక్క మళ్లీ మొరుగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ తీవ్రంగా మారింది. ఈ క్రమంలో సత్యం, అతని సోదరుడు శివమ్‌.. సుశీల్‌, అతని కుమారులు తరుణ్‌, అమన్‌లపై కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురూ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-04-14T08:37:06+05:30 IST