విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-04-03T07:54:08+05:30 IST

ఫిబ్రవరి 1 నుంచి విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చిన వారందరినీ 14 రోజులపాటు క్వారంటైన్‌ చేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిల్‌ దాఖలయ్యింది. ఈ వ్యాజ్యాన్ని తెలంగాణ...

విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్‌

హైకోర్టులో విశ్వేశ్వరరావు వ్యాజ్యం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 1 నుంచి విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చిన వారందరినీ 14 రోజులపాటు క్వారంటైన్‌ చేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిల్‌ దాఖలయ్యింది. ఈ వ్యాజ్యాన్ని తెలంగాణ డెమెక్రాటిక్‌ ఫోరం కన్వీనర్‌, తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పి.ఎల్‌. విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్‌ సంయుక్తంగా దాఖలు చేశారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్స్‌,  మాస్క్‌లు అందచేయాలని వారు కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా... అరికట్టేందుకు అవసరమైన డయాగ్నసిస్‌ కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్స్‌, మాస్కులు, శానిటైజర్లు కొనుగోళ్లు చేయడం లేదని, వాటిని తయారు చేయడానికి చర్యలు చేపట్టడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2020-04-03T07:54:08+05:30 IST