గువాహటి స్టేడియంలలో క్వారెంటైన్ బెడ్లు: అస్సోం ఆరోగ్య మంత్రి

ABN , First Publish Date - 2020-03-27T02:40:53+05:30 IST

కరోనా వ్యాధి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అస్సోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సోం రాజధాని గువాహటిలోని సరుసజాయ్,

గువాహటి స్టేడియంలలో క్వారెంటైన్ బెడ్లు: అస్సోం ఆరోగ్య మంత్రి

గువాహటి: కరోనా వ్యాధి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అస్సోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సోం రాజధాని గువాహటిలోని సరుసజాయ్, నెహ్రూ స్టేడియంలలో ఒక్కింటిలో వెయ్యికి పైగా క్వారెంటైన్ బెడ్లు ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వి శర్మ వెల్లడించారు. రానున్న ఐదు లేదా ఆరు రోజుల్లో ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


గువాహటిలోని కలాపహార్‌లోని ఐడీఎస్‌పీ ఆసుపత్రి, సింగిమరిలోని మోడల్ ఆసుపత్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలను కరోనా వ్యాధికి చికిత్స అందించే కేంద్రాలుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. గువాహటిలో మహేంద్ర మోహన్ చౌదరీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన అక్కడ ఉన్న 150 బెడ్స్‌ని కేవలం కరోనా చికిత్స కోసం వినియోగిస్తామని.. ప్రసూతి విభాగం తప్ప మిగితా విభాగాలన్ని పూర్తి మూసివేయబడతాయని పేర్కొన్నారు.  అయితే అస్సోంలో ఇప్పటి వరకూ ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అస్సోం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-03-27T02:40:53+05:30 IST