Abn logo
Mar 30 2020 @ 04:52AM

క్వారంటైన్‌ ఏర్పాటుకు ససేమిరా

నాగులపాలెం(పర్చూరు), మార్చి 29 : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేసేవిధంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పర్చూరు మండల పరిధిలోని బాలికల గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఆదివారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సమాచారం అందుకున్న సమీప కాలనీవాసులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ప్రాంగణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement
Advertisement