పెన్షనర్లకు క్వాంటమ్‌ తొలగించడం అన్యాయం

ABN , First Publish Date - 2022-01-20T05:49:36+05:30 IST

పెన్షనర్లు 10శాతం అడిషనల్‌ క్వాంటమ్‌ పొందే సౌకరాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది.

పెన్షనర్లకు క్వాంటమ్‌ తొలగించడం అన్యాయం
కవిటి: నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

 గుజరాతీపేట:  పెన్షనర్లు 10శాతం అడిషనల్‌ క్వాంటమ్‌ పొందే సౌకరాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. బుధవారం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గం సమావే శమైంది. పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ..  27శాతం ఇంటెరిమ్‌ రిటీప్‌ (ఐఆర్‌)ను 23 శాతానికి తగ్గించినందున కేవలం పెన్షన్‌ ఆధారంగా బతుకుతున్న విశ్రాంత ఉద్యోగులకు ఎంతోనష్టం వాటిల్లు తుందన్నారు. దీంతో  శ్రీకాకుళం పట్ట ణంలో సుమారు 6,500 మంది, జిల్లాలో 18వేల మంది మనోవేదనకు గురౌతున్నారని తెలిపారు. 80ఏళ్లు దాటిన వారు క్వాంటమ్‌ సౌకర్యాన్ని పొందేందుకు ఎంతమంది బతికి ఉంటారని ప్రశ్నిం చారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

 పీఆర్సీపై ఉపాధ్యాయుల నిరసన 

కవిటి:  మండలంలోని ఇద్దివానిపాలెం ప్రాఽఽథమికోన్నత పాఠశాలలో     బుధవారం పీఆర్సీపై నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయ సంఘ నాయ కులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి పీఆర్సీ చూడలేదని, ఉద్యోగులు, పింఛన్‌దారులకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు రాజబాబు, మురళీ ప్రకాష్‌, తేజ, నాగరాజు, రామచంద్రరావు పాల్గొన్నారు. 

పాలకొండ: డివిజన్‌ హెడ్‌క్వార్టర్లు, సబ్‌ కలెక్టరేట్ల ఎదుట జాక్టో, ఉపాధ్యాయ సం ఘాల ఆధ్వర్యంలో పీఆర్సీ జీవోలకు  వ్యతిరే కంగా   చేపడుతున్న నిరసన ప్రదర్శనలకు సంఘీభావం తెలుపుతున్నామని ఏపీజీఈవో ఆర్గనైజింగ్‌ జిల్లా కార్యదర్శి నూతులపాటి భరత్‌భూషణ్‌రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-20T05:49:36+05:30 IST