మెళకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి

ABN , First Publish Date - 2022-05-25T05:28:53+05:30 IST

పట్టు రైతులు మల్బరిసాగులో, గూళ్ల పెంపకంలో మెళకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి సాధిస్తారని రాయచోటి ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

మెళకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి
పట్టురైతులకు అవగాహన కల్పిస్తున్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్‌

మదనపల్లె టౌన్‌, మే 24: పట్టు రైతులు మల్బరిసాగులో, గూళ్ల పెంపకంలో మెళకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి సాధిస్తారని రాయచోటి ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభు త్వ పట్టుగూళ్ల మార్కెట్‌ వద్ద మూడు నియోజకవర్గాలకు చెందిన పట్టురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్ర వేత్త మాట్లాడుతూ మల్బరిసాగులో మొక్క లను 6కు2 అడుగుల దూరంలో నాటాలని దీని వలన మొక్కలకు ఎరువులు వేయడం, పాదులు తీయడం, ఆకులు కోయడం సులువుగా వుంటుందన్నారు. పట్టుగూళ్లు ఉత్పత్తి అయ్యాక వాటిని గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు విక్రయానికి తీసుకుస్తే అధిక ధరలు పలికే అవకాశం వుందన్నారు. పట్టుపరిశ్రమ ఏడీ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మల్బరి యూనిట్‌కు రూ.25,000 నిధులు అందిస్తుందని దీనిలో ఓసీలకు రూ.18,750 సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.22,500 సబ్సిడీ వస్తుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి మల్బరీ పంట పెట్టిన రైతులకే ఈ సబ్సిడీ వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో మదనపల్లె, తంబళ్లపల్లె టెక్నికల్‌ అధికారులు నంజుడప్ప, రసూల్‌ఖాన్‌, మార్కెట్‌ ఇన్‌చార్జి ప్రసన్న, రవినాయక్‌, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T05:28:53+05:30 IST