ప్రశాంతంగా చనిపోవడానికి ఏ దేశం బాగుంటుందో తెలుసా?.. కచ్చితంగా అమెరికా మత్రం కాదు.. భారత్ పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-02-04T09:42:02+05:30 IST

ప్రపంచంలో మానవుడు ప్రశాంతంగా జీవించడమే కాదు.. మరణించాలని కూడా అనుకుంటాడు. చనిపోయేటప్పుడు తన చుట్టూ ఏ బాధలు ఉండకూడదని, మానసికంగా, శారిరకంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. తను జీవించే పరిసరాల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని కలలు కంటాడు...

ప్రశాంతంగా చనిపోవడానికి ఏ దేశం బాగుంటుందో తెలుసా?.. కచ్చితంగా అమెరికా మత్రం కాదు.. భారత్ పరిస్థితి ఎలా ఉందంటే..

ప్రపంచంలో మానవుడు ప్రశాంతంగా జీవించడమే కాదు.. మరణించాలని కూడా అనుకుంటాడు. చనిపోయేటప్పుడు తన చుట్టూ ఏ బాధలు ఉండకూడదని, మానసికంగా, శారిరకంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. తను జీవించే పరిసరాల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని కలలు కంటాడు. కానీ ఇలాంటి కలలు నిజమయ్యేది ధనిక దేశాలలో జీవించేవారికే.. పేద దేశాలలో జీవించే వ్యక్తికి ఇది ఒక కలగా మాత్రమే మిగిలిపోతుంది. ఇది పూర్తిగా నిజం కాదని నిరూపించడానికి పరిశోధకులు ఇటీవల 'క్వాలిటీ ఆఫ్ డెత్ అండ్ డయింగ్ ఇండెక్స్ 2021' అని ఒక సర్వే చేశారు.


ఈ అధ్యయనంలో అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు పాల్గొన్నారు. ఇందులో ప్రపంచంలోని 81 దేశాలలో జీవన ప్రమాణాలుతో పాటు మనిషి జీవితంలోని చివరి రోజులలో ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నాడనే అంశాలపై పరిశోధన చేశారు. ఈ 81 దేశాలను A, B, C, D, E, F అని గ్రేడుల వారీగా విభజించారు. ఈ సర్వే నివేదికలో కేవలం 6 దేశాలకు A గ్రేడు లభించగా.. 21 దేశాలకు F గ్రేడు దక్కింది.


ఏ దేశం టాప్‌లో ఉందంటే..

ఈ సర్వేలో యునైటెడ్ కింగ్‌డమ్(బ్రిటన్) టాపర్‌గా నిలిచింది. A గ్రేడ్ లిస్టులో బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఐర్లాండ్, తాయివాన్, కోస్టా రికా, సౌత్ కొరియా, అస్ట్రేలియా దేశాలున్నాయి. ఈ ఆరు దేశాలలో మనిషి చివరి రోజులలో అతనికి మంచి శారీరక, మానసిక చికిత్స లభిస్తుంది.


81 దేశాల పట్టికలో పరాగ్వే చివరి స్థానంలో నిలిచింది. పరాగ్వే దేశంలో మృత్యువుకు సమీపంగా ఉండే మనుషులకు ప్రశాంతత ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. పరాగ్వేతోపాటు బంగ్లాదేశ్, లెబనాన్, బ్రజిల్, పోర్చుగల్, సౌత్ ఆఫ్రికా, నేపాల్, సుడాన్, మలెషియా, ఇథియోపియా దేశాలకు కూడా F గ్రేడు లభించింది.


భారత దేశానికి ఈ పట్టికలో D గ్రేడ్ లభించింది. అలాగే చైనా, రషియా,గ్రీస్, ఇండోనేషియా, వియెత్నాం దేశాలు కూడా D గ్రేడ్ లిస్టులో ఉన్నాయి. విచిత్రమేమిటంటే అగ్రరాజ్యం అమెరికాకు C గ్రేడ్ లభించింది. అమెరికాతో పాటు కొలంబియా, థాయ్ లాండ్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, డెన్మార్క్, నైజీరియా లాంటి దేశాలు కూడా C గ్రేడ్ పొందాయి.


ఆ గ్రేడులన్నీ పరిశీలిస్తే అధికంగా సంపన్న దేశాలకే మంచి గ్రేడ్‌లు లభించాయి. కానీ కొన్ని మధ్య, పేద దేశాలకు ఓ మోస్తరు గ్రేడ్ లభించింది. ఉదాహరణకు అమెరికాలో బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ దేశానికి A గ్రేడ్ లభించలేదు. డబ్బు మాత్రమే మంచి జీవన ప్రమాణాలు అందించలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఆ దేశాలలో ఉన్న ప్రభుత్వాలు అందించే ఆరోగ్య వసతులు, మంచి సమాజమే ముఖ్యమని వారు చెబుతున్నారు. 


ప్రపంచంలో  ప్రజలు ఎక్కువగా జీవితాన్ని విలాసవంతంగా గడపడానికే ఇష్టపడుతున్నారని.. అందుకే వారి సంపాదనలో ఎక్కువ శాతం విలాసాలకు ఖర్చు పెడుతున్నారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మనిషి చనిపోయేముందు చికిత్స కోసం కేవలం అవసరమైతేనే ఖర్చుపెడుతున్నారని కూడా వారు చెప్పారు.



Updated Date - 2022-02-04T09:42:02+05:30 IST