నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి

ABN , First Publish Date - 2021-10-20T05:13:40+05:30 IST

రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండలం లోని ఆలూర్‌ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రం, హర్వెస్టింగ్‌ మిషన్‌ను ఆయన పరిశీలించారు. ధాన్యం ఎఫ్‌ఏవో నాణ్యత ప్రమాణాల ప్రకా రం

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

ఆర్మూర్‌ రూరల్‌, అక్టోబరు 19: రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండలం లోని ఆలూర్‌ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రం, హర్వెస్టింగ్‌ మిషన్‌ను ఆయన పరిశీలించారు. ధాన్యం ఎఫ్‌ఏవో నాణ్యత ప్రమాణాల ప్రకా రం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు పంట కోత సమయంలో హర్వెస్టర్‌ బ్లోయర్‌ 18-20 ఆర్‌పీఎం ఉంచి కోసినట్టయితే గడ్డి కర్ర ధాన్యం రాకుండా ఉంటుందన్నారు. దీని ద్వారా నాణ్యమైన ధర లభించి క్వింటా లుకు రూ.1960 మద్దతుధర పొందవచ్చన్నారు. ఇందులో డీసీవో సింహచలం, పౌర సరఫరాల శాఖ డీఎం అభిషేక్‌, సొసైటీ చైర్మన్‌ కల్లెం బోజారెడ్డి సర్పంచ్‌ కల్లెం మోహన్‌, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-20T05:13:40+05:30 IST