అంగన్‌వాడీలో నాణ్యమైన గుడ్లను అందించాలి

ABN , First Publish Date - 2022-05-20T05:57:28+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన గుడ్లను అందించాలని పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా పోషణ్‌అభియాన్‌ ద్వారా పోషకాహారాన్ని అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు.

అంగన్‌వాడీలో నాణ్యమైన గుడ్లను అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ  

- జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు

సిరిసిల్ల, మే 19 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన గుడ్లను అందించాలని పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా పోషణ్‌అభియాన్‌ ద్వారా పోషకాహారాన్ని అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో విద్య, వైద్యం, ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, నిర్మాణ పనుల స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ ఆరుణ అధ్యక్షత వహించారు. వ్యవసాయ సమావేశానికి వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, మహిళ సంక్షేమానికి తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల, సాంఘిక సంక్షే మం సమావేశానికి బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపా క ఉమ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ గర్భిణీలకు విధిగా ఎనీమియా పరీక్షలు చేయాలని నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. జిల్లాలోని ప్రతి మహిళ వారి అత్మరక్షణకు సఖి కేంద్రాన్ని సద్వినియోగ పర్చుకునేలా మహిళలకు అవగాహన కల్పిం చాలన్నారు. జిల్లాలోని వయోవృద్ధులకు, దివ్యాంగుల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జూన్‌ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని, కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు లు ఇబ్బంది పడకూడదని ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రతీ ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం లో జిల్లాలో మొదటి విడతలో 172 పాఠశాలలు ఎంపిక చేశారని వాటిలో మౌలిక వసతులు కల్పించే చర్య లు మొదలయ్యాయన్నారు. పదోతరగతి  పరీక్షలు మే 23 నుంచి జూన్‌ 1 వరకు ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించా రు. జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఇప్పటి వరకు 75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మిషన్‌భగీరథ పనులు పూర్తి చేయాలని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించాలన్నారు. మంత్రి కేటీఆర్‌ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తు న్నారన్నారు. సమావేశంలో జడ్పీటీసీలు గట్ల మీనయ్య, గుండం నర్సయ్య, నాగం కుమార్‌, కో అప్షన్‌సభ్యుడు చాంద్‌పాషా, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:57:28+05:30 IST