నాణ్యమైన విద్య తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యం

ABN , First Publish Date - 2022-07-03T06:03:55+05:30 IST

విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుగా ఉండకూడదనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అంది స్తుందని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు.

నాణ్యమైన విద్య తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యం
విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌

నిర్మల్‌ చైన్‌గేట్‌ , జూలై 2 : విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుగా ఉండకూడదనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అంది స్తుందని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. శనివారం సోఫీనగర్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను మున్సిపల్‌ చైర్మన్‌ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ మాట్ల్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో విద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించడానికి ముందుంటామన్నారు. ఉపాధ్యాయులు భోఽధించే పాఠాలను విద్యార్థులు శ్రద్దగావిని ఉత్తమమార్కులు సాధించి తల్లిదండ్రులకు, జిల్లా విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే శానిటేషన్‌ పరంగా మైదానంలో ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి, వెంటనే శుభ్రం చేయాలని మున్సిపల్‌ సానిటేషన్‌ అధికారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నీరడి గంగాశంకర్‌, సహాయ ప్రిన్సిపాల్‌ వీణారాణిని , ఉపాధ్యాయులు కల్పన, వనజ, వెంకట్‌, ఓదేలుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. 

మంత్రి అల్లోల సహకారంతో అభివృద్ధి పనులు

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో నిర్మల్‌ పట్టణంలో అభివృద్ది ప నులను చేపడుతున్నట్లు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. చైన్‌గేట్‌ నుంచి బంగల్‌పేట్‌ వరకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బీటీ రోడ్డు పనుల విషయమై శనివారం ఉదయం మున్సిపల్‌ చైర్మన్‌ రోడ్డుపై వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్థులతో మాట్లాడి తమ దుకాణాలను వేరే చోటికి మార్చుకోవాలని కోరారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 14 వార్డులకు రహదారి అయిన గాంధీచౌక్‌ ప్రాంతం వెంబడి రెండు స్కూల్‌ బస్సు లు, అంబులెన్స్‌ వాహనం, తదితర వాహనాలు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు రోడ్డువెడల్పు పనులను పూర్తి చేసామని తెలిపారు. రోడ్డువెడల్పు కార్యక్రమం చేపట్టడంతో నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు వాహనదారులకు, ప్రజలకు సౌకర్యవంతంగా మారిందన్నారు.  జరుగుతున్న అభివృద్ది పనులను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేంధర్‌, స్థానిక కౌన్సిలర్‌లు అయ్యన్న గారి రాజేంధర్‌, ఎస్పీరాజు, పూదరి రాజేశ్వర్‌, ముజాయిద్‌, ఇన్‌చార్జీ సానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌ మురారి, కుర్మెరాజుతో పాటు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:03:55+05:30 IST