‘యాదాద్రి’ విరాళాల సేకరణకు క్యూఆర్‌ కోడ్‌

ABN , First Publish Date - 2021-10-28T09:47:22+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణం లో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం నిర్వహణకు భక్తుల....

‘యాదాద్రి’ విరాళాల సేకరణకు క్యూఆర్‌ కోడ్‌

విడుదల చేసిన ఈవో గీతారెడ్డి

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణం లో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం నిర్వహణకు భక్తుల నుంచి విరాళా లు సేకరించేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ (క్యూఆర్‌) కోడ్‌ను దేవస్థాన ఈవో గీతారెడ్డి బుధవారం విడుదల చేశారు. దీంతో ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు అందజేసే విరాళాలు నేరుగా దేవస్థాన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ఈవో తెలిపారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డబ్బు చెల్లించాలనుకునే భక్తులు ముం దుగా ఖిఖఐఔఅఓఖిఏకఐ ూఅఖఅఖిఐకఏఅ ఖిగిఅక్గ ఈఉగఅఖిఖీఏఅూఅక, ్ఞట ఛిౌఛ్ఛీ జౌట డ్చఛ్చీఛీటజీ జ్చూజుటజిఝజీ ుఽ్చట్చటజీఝజ్చి ః జీుఽఛీజ్చీుఽఛజు అని ఉందని నిర్ధారించుకున్న తర్వాతే డబ్బు చెల్లించాలి. కాగా, యాదాద్రి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ బుధవారం పరిశీలించారు. కొండపైన ప్రధానాలయం, శివాలయం, విష్ణు పుష్కరిణి, దర్శన క్యూలైన్లు తదితర ప్రాంతాల్లో పనుల నిర్వహణ తీరును అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే యాదాద్రి క్షేత్రాన్ని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు సందర్శించి ప్రధానాలయం, శివాలయంతో పాటు పెద్దగుట్టపైన వైటీడీఏ గెస్ట్‌ హౌస్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

Updated Date - 2021-10-28T09:47:22+05:30 IST