Qatar వెళ్లేవారికి తీపి కబురు

ABN , First Publish Date - 2022-03-11T14:24:08+05:30 IST

గల్ఫ్ దేశం ఖతార్ వెళ్లేవారికి అక్కడి సర్కార్ తీపి కబురు అందించింది.

Qatar వెళ్లేవారికి తీపి కబురు

దోహా: గల్ఫ్ దేశం ఖతార్ వెళ్లేవారికి అక్కడి సర్కార్ తీపి కబురు అందించింది. వచ్చే శనివారం నుంచి కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెళ్లడించింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న దేశ పౌరులు, ప్రవాసులు, విదేశీ పర్యాటకులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇండోర్ కార్యక్రమాలకు హాజరు కావచ్చని పేర్కొంది. ఇక వ్యాక్సినేషన్ పూర్తికాని వారు మాత్రం 20 మందికి మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. జీమ్స్, వెడ్డింగ్ హాల్స్, క్రీడా మైదానాలు, రెస్టారెంట్స్, ఎగ్జిబిషన్స్, కేఫ్స్, థీమ్ పార్క్స్, సినిమా హాళ్లకు తాజాగా సడలించిన ఆంక్షలు వర్తిస్తాయని వెల్లడించింది. అయితే, బహిరంగా ప్రదేశాల్లో ముఖానికి మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక ఫిబ్రవరిలోనే ఖతార్ దేశవ్యాప్తంగా ఎంట్రీకి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేసిన విషయం విదితమే.     

Updated Date - 2022-03-11T14:24:08+05:30 IST