Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా ఎఫెక్ట్.. ఖతార్ కొత్త ఆంక్షలు!

దోహా: గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఖతార్ కొత్త ఆంక్షలు విధించింది. సినిమా హాళ్లు, బ్యూటీ సెలూన్స్, బార్బర్ షాపులు, లైబ్రరీలను మూసివేయించింది. అలాగే ప్రజా రవాణపై కూడా ఆంక్షలు విధించింది. అటు రంజాన్ మాసంలో నిర్వహించే తారావిహ్ ప్రార్థనలను సైతం ఇంట్లోనే నిర్వహించుకోవాలని ఆదేశించింది. 12 ఏళ్లలోపు పిల్లలను మసీదుల్లోకి రాకుండా నిషేధం విధించింది. పబ్లిక్, ప్రైవేట్ సంస్థలలో కేవలం 50 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలని సూచించింది. శుక్రవారం నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఖతార్‌లో విజృంభిస్తున్న మహమ్మారి ఇప్పటి వరకు 1,86,201 మందికి సోకగా.. ఇందులో 320 మందిని పొట్టనబెట్టుకుంది.       

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement