11 ఏళ్ల వయసులో రికార్డు సృష్టించిన కేరళ అమ్మాయి!

ABN , First Publish Date - 2022-07-16T17:25:50+05:30 IST

తల్లిదండ్రులతో పాటు ఖతర్‌లో ఉంటున్న కేరళ అమ్మాయి.. రికార్డు సృష్టించింది. మూడు పుస్తకాలను రచించి.. పుస్తక సిరీస్‌ను ప్రచురించిన అతిపిన్న వయస్కురాలిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. కేరళకు చెందిన లైబా అబ్దుల్ బాసిత్‌కు ప్రస్తుతం 11ఏళ్లు.

11 ఏళ్ల వయసులో రికార్డు సృష్టించిన కేరళ అమ్మాయి!

ఎన్నారై డెస్క్: తల్లిదండ్రులతో పాటు ఖతర్‌లో ఉంటున్న కేరళ అమ్మాయి.. రికార్డు సృష్టించింది. మూడు పుస్తకాలను రచించి.. పుస్తక సిరీస్‌ను ప్రచురించిన అతిపిన్న వయస్కురాలిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. కేరళకు చెందిన లైబా అబ్దుల్ బాసిత్‌కు ప్రస్తుతం 11ఏళ్లు. దోహాలోని ఆలీవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 6వ గ్రేడ్ చదువుతోంది. చిన్న పిల్లలను ఉద్దేశించి ఫాంటసీ స్టోరీలతో మూడు పుస్తకాలు రాసి.. ‘ఆర్డర్ ఆఫ్ ది గెలాక్సీ’ బుక్ సిరీస్‌ను ప్రచురించింది. దీంతో బుక్ సిరీస్‌ను ప్రచురించిన అతి పిన్న వయస్కురాలిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈమె రాసిన పుస్తకాలు ఈకామర్స్ వెబ్‌సైట్లు, ప్రముఖ బుక్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. కాగా.. ఇంతకు ముందు ఈ రికార్డు సౌదీ అరేబియాకు చెందిన రీతజ్ ఉస్సైన్‌ పేరుపై ఉండేంది. కానీ.. లైబా అబ్డుల్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. 


Updated Date - 2022-07-16T17:25:50+05:30 IST