Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండచిలువను తలదిండు అనుకుని రెండు రోజులు హాయిగా పడుకున్నాడు....నిజం తెలియగానే...

కోర్బా: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో గల ఝగ్రహా గ్రామంలోని ఒక ఇంటిలో రెండు రోజులుగా ఒక భారీ కొండచిలువ దాక్కుంది. ఆ ఇంటిలోని వ్యక్తి దానిని తలదిండుగా భావించి దానిపై పడుకున్నాడు. అసలు విషయం తెలిశాక ఇంటిలోని వారికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. రెస్క్యూ టీమ్ ఆ కొండచిలువను ఆ ఇంటిలోని నుంచి బయటకు తరలించి వారి ప్రాణాలు కాపాడింది. 

వివరాల్లోకి వెళితే ఈ ప్రాంతంలోని యాదవ్ కుటుంబ పెద్ద భూనా యాదవ్ గత రెండు రెండురోజులుగా పడుకుంటున్న మంచానికి ఒకవైపు దుప్పటి కింద ఒక కొండచిలువ చుట్టలా చుట్టుకుని నక్కివుంది. దానికి అక్కడ వెచ్చగా అనిపించి, కదలకుండా  అలానే తిష్టవేసింది. అయితే దానిని తలదిండుగా భావించిన భూనా యాదవ్ రెండు రోజులుగా దానిపైనే పడుకుంటున్నాడు. అయితే  ఈ సంగతిని కుటుంబ సభ్యులు గమనించేసరికి వారికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. అటవీశాఖ అధికారులకు వారు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి వచ్చి, ఆరడుగుల కొండచిలువను అక్కడి నుంచి తరలించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement