Viral Video: కుక్కల కోసం వచ్చిన భారీ కొండచిలువ.. వెనక్కు తగ్గని శునకాలు.. ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2022-02-18T23:32:24+05:30 IST

కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుక్కలను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఓ భారీ కొండచిలువ నీటిలో పాకుతూ వస్తుంది. దాన్ని చూసి ఒక్కసారిగా కుక్కలన్నీ షాక్ అవుతాయి. చివరికి ఏమైందంటే..

Viral Video: కుక్కల కోసం వచ్చిన భారీ కొండచిలువ.. వెనక్కు తగ్గని శునకాలు.. ఏం జరిగిందో మీరే చూడండి..!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్నయితే నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుక్కలను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఓ భారీ కొండచిలువ నీటిలో పాకుతూ వస్తుంది. దాన్ని చూసి ఒక్కసారిగా కుక్కలన్నీ షాక్ అవుతాయి. చివరికి ఏమైందంటే..


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సుమారు 12అడుగుల కొండచిలువ వేట కోసం  నీటిలో ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో కొన్ని కుక్కలు నీటి నుంచి అవతలి ఒడ్డుకు వెళ్తుంటాయి. వాటిని గుర్తించిన కొండచిలువ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కుక్కలు మొదట కొంచెం కంగారుపడినా ఏమాత్రం భయపడకుండా అటూ, ఇటూ తిరుగుతూ కొండచిలువను తికమక పెడతాయి. కాసేపటికి ‘‘ఈ కుక్కలతో పెట్టుకోవడం కంటే వెళ్లిపోవడం మేలు’’.. అన్నట్లుగా ఆ కొండచిలువ తన దారిన అది వెళ్లిపోతుంది. ఒడ్డున ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘‘వామ్మో.. ఎంత పెద్ద కొండచిలువ’’.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

సరదాగా ఈత కొడుతున్న వ్యక్తి.. ఇంతలో అటుగా దూసుకొచ్చిన భారీ సొరచేప.. చివరికి..





Updated Date - 2022-02-18T23:32:24+05:30 IST