కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్ గణేశ్
పెందుర్తి, జనవరి 26: సుజాతనగర్ బీఆర్‌టీఎస్ రోడ్డుపై మంగళవారం రాత్రి ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీ ప్రధాన ఆర్చి పక్క నుంచి సుమారు ఏడు అడుగులు గల కొండచిలువ పాక్కుంటూ రహదారిపైకి వచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ గణేశ్‌కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తరువాత దానిని దూరంగా కొండ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.