Abn logo
Jul 26 2021 @ 06:48AM

చెరుకు తోటలో లేడిపిల్లను మింగిన కొండచిలువ!

లక్నో: యూపీలోని దుధ్వా టైగర్ రిజర్వ్ అడవులకు ఆనుకునివున్న ఒక చెరుకు తోటలో ఒక భారీకొండచిలువ లేడిపిల్లను మింగేసింది. దీనిని గమనించిన సమీప గ్రామస్తులు హడలెత్తిపోయారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. ఈ ఘటన లఖీమ్‌పూర్ పరిధిలోని బసయీ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు తెలసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి ఆ భారీ కొండచిలువను ఒక డ్రమ్ములో బంధించారు. తరువాత దానిని దుధ్వా అడవులలో సురక్షితంగా విడిచిపెట్టారు.