ఇంటర్నెట్ డెస్క్: తమతో పాటూ ఓ కొండచిలువ ఏకంగా 100 మైళ్ల దూరం ప్రాయాణించిందని తెలుసుకున్ యాత్రికులు ఒక్కసారిగా షాకైపోయారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇటీవల జరిగిందీ ఘటన. కొందరు ప్రయాణికులు ఓ నావలో విహారయాత్రకు వెళ్లారు. 100 మైళ్ల ప్రయాణించాక వెనక్కు తిరిగొచ్చారు. అయితే యాత్ర పూర్తయ్యాక ఒక్కొక్కరూ నావ నుంచి దిగిపోతుండా..అందులోని సిబ్బంది ఒకరు పడవలో పెద్ద కొండ చిలువ చుట్టుచుట్టుకుని పడుకుని గమనించారు ఆ తరువాత.. పోలీసులకు సమాచారం. అయితే.. నావలో ఇంతదూరం ఆ కొండచిలువ తమతో పాటే వచ్చిందని తెలిసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాకైపోయారు. ఆ రాష్ట్రంలోని మార్కో ద్వీపంలో ఇదంతా జరిగింది. అయితే.. విహార యాత్ర మొదలవకముందే ఆ కొండ చిలువ నావలోకి వెళ్లి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు.