Abn logo
Sep 24 2021 @ 18:38PM

భారీగా నష్టపోయిన పీవీఆర్...

హైదరాబాద్ : మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్... ఈ రోజు తీవ్రంగా నష్టపోయింది. శుక్రవారం బీఎస్ఈలో ఇంట్రా డే ట్రేడ్‌లో పీవీఆర్ షేర్ నాలుగు శాతానికి పడిపోయి.. రూ. 1,505.90 కు చేరింది. బ్యాంక్ ఫెసిలిటీలు, డెట్ కార్యక్రమాలపై రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేటింగ్‌ తగ్గింది. ఈ క్రమంలో... షేర్లు దెబ్బతిన్నాయి. గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో... స్టాక్ గురువారం వరకు 13 శాతం మేర పుంజుకుంది. ఈ నేపధ్యంలో... షేరు ధర గరిష్ట స్థాయి(రూ. 1,631.85) కి చేరింది. శుక్రవారం మాత్రం ప్రతికూల పరిస్థితిని చవిచూసింది.