Commonwealth Games 2022: రజత పతకంతో సరిపెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్

ABN , First Publish Date - 2022-08-03T13:19:07+05:30 IST

2022 కామన్వెల్త్ క్రీడల్లో(Commonwealth Games 2022) భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూతో(PV Sindhu)పాటు భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్(Indian badminton mixed team) రజత పతకంతో(silver medal)...

Commonwealth Games 2022: రజత పతకంతో సరిపెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్

బర్మింగ్‌హామ్: 2022 కామన్వెల్త్ క్రీడల్లో(Commonwealth Games 2022) భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూతో(PV Sindhu)పాటు భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్(Indian badminton mixed team) రజత పతకంతో(silver medal) సరిపెట్టుకుంది.మంగళవారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022 మిక్స్‌డ్ గ్రూప్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది.కామన్వెల్త్ గేమ్స్‌లో ఒలింపిక్ విజేత పీవీ సింధూతో కూడిన భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్స్‌లో మలేషియాపై 3-1 తేడాతో ఓడిపోయింది.


మహిళల సింగిల్స్ మ్యాచ్ లో మలేషియాతో జరిగిన పోరులో పీవీ సింధూ మాత్రమే విజయం సాధించింది.మొదటి మ్యాచ్‌లో ఇండియాకు చెందిన చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయ్ యిక్‌లపై కఠినమైన మొదటి గేమ్‌లో లాక్ అయ్యారు. నెక్‌ టు నెక్‌ మ్యాచ్‌లో మలేషియా జట్టు తొలి మ్యాచ్ ను గెలుచుకుంది.రెండో మ్యాచ్‌లో పీవీ సింధు జిన్ వీ గోహ్‌తో తలపడింది. మ్యాచ్ ప్రారంభ గేమ్‌లో పీవీ సింధూ దూకుడుగా ఆడుతూ మలేషియాకు చెందిన జిన్ వీ గోహ్‌పై 22-20తో ఆధిక్యంలోకి వెళ్లింది.


మూడో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21తో మలేషియాకు చెందిన ఎన్జీ త్జే యోంగ్‌పై ఓపెనింగ్ గేమ్‌లో ఓడిపోయాడు.ఈ మ్యాచ్‌లో మలేషియా ఆటగాడు తన జోరును కొనసాగించి 21-19, 6-21, 21-16 తేడాతో భారత జట్టుపై అద్భుత విజయం సాధించాడు.మ్యాచ్ అనంతరం మలేషియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి గేమ్‌లో భారత జోడీ 18-21తో ఓడిపోయింది. మలేషియా జోడీ రెండో గేమ్‌ను 21-17తో గెలిచి 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.


Updated Date - 2022-08-03T13:19:07+05:30 IST